వాణిజ్య లైసెన్స్

వివరణ:

వాణిజ్య లైసెన్స్ సేవ డిజిటల్ ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది తద్వారా పౌరుడు వాణిజ్య లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి, అప్లికేషన్  ను ట్రాక్ చేయడానికి, తరువాత ఆన్‌లైన్‌లో చెల్లింపులను చేయడానికి మరియు చెల్లింపు రసీదును & వాణిజ్య లైసెన్స్ సర్టిఫికెట్లను డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా ఉపకరిస్తుంది. ఈ సేవను ఉపయోగించి పౌరుడు వాణిజ్య లైసెన్స్ పునరుద్ధరణకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 

దశలు:

  • 1.సంబంధిత డేటా మరియు పత్రాలతో వాణిజ్య లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోండి.
  • 2. దరఖాస్తు రుసుము చెల్లించండి(వర్తించినచో).
  • 3. సి బి అధికారుల ద్వారా దరఖాస్తులు ధృవీకరించడం, తనిఖీ చేయడం మరియు ఆమోదించడం జరుగుతుంది.
  • 4. దరఖాస్తులు ఆమోదం పొందిన తరువాత వాణిజ్య లైసెన్స్ రుసుము చెల్లించి వాణిజ్య లైసెన్స్ సర్టిఫికెట్ ను డౌన్ లోడ్ చేసుకోండి.​

సౌకర్యాలు:

  • 1. దరఖాస్తు యొక్క స్థితి ఆన్లైన్ ట్రాకింగ్.
  • 2. ఎస్ ఎం ఎస్ మరియు ఈమెయిల్ ద్వారా స్థితి నవీకరణ.
  • 3. దరఖాస్తు కాపీ, రసీదు మరియు ట్రేడ్ లైసెన్స్ సర్టిఫికెట్ ను డౌన్లోడ్ చేసి ప్రింట్ చేసుకోండి.

మరిన్ని వివరాల కోసం డౌన్‌లోడ్ చేసుకోండి హ్యాండ్ బుక్ ఇక్కడ: